My Telugu NRI

Mobile Scrollable Menu
- Business - Latest News

మరో కొత్త రంగంలోకి ఫ్లిప్‌కార్ట్‌

వాల్‌మార్ట్‌ కు చెందిన ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మినిట్స్‌ పేరుతో క్విక్‌ కామర్స్‌ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థ, ఫుడ్‌ డెలివరీ విభాగంలోనూ సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. ఫ్లిప్‌కార్ట్‌ ఫుడ్‌ డెలివరీ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నదన్న వార్తల నేపథ్యంలో, ఇప్పటికే ఈ రంగంలో హవా నడిపిస్తున్న స్విగ్గీ, జొమాటోల షేర్‌లు నష్టపోయాయి. ఈ ఏడాది మే-జూన్‌ నెలల మధ్య బెంగళూరులో ప్రయోగాత్మకంగా ఫుడ్‌ డెలివరీ […]

వాల్‌మార్ట్‌ కు చెందిన ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మినిట్స్‌ పేరుతో క్విక్‌ కామర్స్‌ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థ, ఫుడ్‌ డెలివరీ విభాగంలోనూ సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. ఫ్లిప్‌కార్ట్‌ ఫుడ్‌ డెలివరీ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నదన్న వార్తల నేపథ్యంలో, ఇప్పటికే ఈ రంగంలో హవా నడిపిస్తున్న స్విగ్గీ, జొమాటోల షేర్‌లు నష్టపోయాయి.

ఈ ఏడాది మే-జూన్‌ నెలల మధ్య బెంగళూరులో ప్రయోగాత్మకంగా ఫుడ్‌ డెలివరీ సేవలను ప్రారంభించేందుకు ఫ్లిప్‌కార్ట్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరినాటికి గానీ, వచ్చే ఏడాదికల్లా గానీ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు కంపెనీ ప్లాన్‌ చేస్తున్నట్లు పేర్కొంది. స్విగ్గీ, జొమాటో తరహాలో స్టాండ్‌ అలోన్‌ ప్లాట్‌ఫామ్‌ను నెలకొల్పాలా? లేదా ప్రభుత్వ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఓఎన్‌డీసీలో బయ్యర్‌ సైడ్‌ అప్లికేషన్‌ను ఏర్పాటు చేయాలా? అనే ఆప్షన్లను ప్రస్తుతం పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఫ్లిప్‌కార్ట్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.