టీ20 వరల్డ్‌కప్‌లో ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 24 రన్స్ తేడాతో నెగ్గింది. దీంతో ఆ జట్టు గ్రూపు సీ నుంచి సూపర్ 8లోకి వెళ్లింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 202 రన్స్ స్కోరు చేసింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇటలీ 178 రన్స్ చేసి ఆలౌటైంది. ఇటలీ ప్లేయర్ బెన్ మానెంటి 25 బంతుల్లో 60 రన్స్ చేసి కాసేపు దడపుట్టించాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. జస్టిస్ మోస్కా 34 బంతుల్లో 43 రన్స్, గ్రాంట్ స్టీవార్ట్ 23 బంతుల్లో 45 రన్స్ చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో విల్ జాక్స్ శరవేగంగా హాఫ్ సెంచరీ కొట్టాడు. కేవలం 22 బంతుల్లో అతను 53 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ 28, జాకబ్ బేతల్ 23, టామ్ బాంటన్ 30 రన్స్ స్కోరు చేశారు.


