మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా నిర్వహించిన ఈ శివాలయాల సందర్శన యాత్రకు విశేష స్పందన లభించింది. ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 6.30 గంటల వరకు ఈ యాత్ర నిర్వహించారు.
ఈ భక్తి యాత్రలో భాగంగా సింగపూర్‌లో ఉన్న 9-12 ప్రముఖ శివాలయాలను సందర్శించడం జరిగింది. ఈ యాత్ర నిర్వహించడానికి సింగపూర్‌లోని జురాంగ్ ఈస్ట్, బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్- పుంగ్గోల్, టాంపనీస్-బెడోక్ ప్రాంతాల నుంచి బస్సులను సమకూర్చి యాత్రను విజయవంతంగా నిర్వహించారు. ఈ దేవాలయాల సందర్శన యాత్రలో భాగంగా వివిధ బస్సుల ద్వారా సుమారు 230 మంది భక్తులు వివిధ దేవాలయాలను సందర్శించి ఆ పరమశివుని దీవెనలు పొందారు. ఈ మహాశివరాత్రి మరుసటి రోజు సింగపూర్‌లో ఉద్యోగులకు పనిరోజు అయినప్పటికీ ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బస్సులు భక్తుల శివనామ స్మరణతో మార్మోగాయి.
ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి, ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము వ్యవహరించారు. వీరితో పాటు యాత్రలో సహాయపడిన పెరుకు శివ రామ్ ప్రసాద్,సమ్మయ్య మొలుగూరి, లక్ష్మణ్ రాజు కల్వ, వేణు గోపాల్ ఐరేని, రావుల సుగుణాకర్ రెడ్డికి కృతజ్ణతలు తెలియజేశారు. ఈ వేడుకలకు ఆర్థిక సహకారం అందించిన నాగులపల్లి శ్రీనివాస్‌కు సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


