My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

10 నెలల చిన్నారికి అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలికిన కేరళ

కేరళలో అతి పిన్న వయస్కురాలైన అవయవదాత 10 నెలల చిన్నారి అలిన్ షెరిన్ అబ్రహంకు రాష్ట్రం కన్నీటి వీడ్కోలు పలికింది. ఐదుగురికి ప్రాణం పోసి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఆ చిన్నారికి ఆదివారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హృదయ విదారక కార్యక్రమానికి వందలాది మంది హాజరై నివాళులర్పించారు. పథనంతిట్ట జిల్లాలోని ఓ చర్చిలో జరిగిన అంత్యక్రియల సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. దుఃఖాన్ని దిగమింగుతూ తల్లిదండ్రులు అరుణ్ అబ్రహం, షెరిన్ ఆన్ […]

కేరళలో అతి పిన్న వయస్కురాలైన అవయవదాత 10 నెలల చిన్నారి అలిన్ షెరిన్ అబ్రహంకు రాష్ట్రం కన్నీటి వీడ్కోలు పలికింది. ఐదుగురికి ప్రాణం పోసి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఆ చిన్నారికి ఆదివారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హృదయ విదారక కార్యక్రమానికి వందలాది మంది హాజరై నివాళులర్పించారు. పథనంతిట్ట జిల్లాలోని ఓ చర్చిలో జరిగిన అంత్యక్రియల సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. దుఃఖాన్ని దిగమింగుతూ తల్లిదండ్రులు అరుణ్ అబ్రహం, షెరిన్ ఆన్ జాన్ తీసుకున్న నిర్ణయం మానవత్వానికి నిలువుటద్దమని పలువురు కొనియాడారు.

ఫిబ్రవరి 5న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో చిన్నారి అలిన్ తీవ్రంగా గాయపడింది. తల్లి, తాతయ్యలతో కలిసి ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన కారు వారి వాహనాన్ని ఢీకొట్టింది. కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె ఫిబ్రవరి 12న బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు వైద్యులు ధ్రువీకరించారు. పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు తమ చిన్నారి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో అలిన్ కాలేయం, కిడ్నీలు, గుండె కవాటాలు, కళ్లను ఐదుగురికి అమర్చారు. మాటలకు అందని బాధలోనూ ఆ తల్లిదండ్రులు అవయవదానం చేసి కేరళ స్ఫూర్తిని చాటారు అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసించారు. ఈ కార్యక్రమం లో  కేంద్ర మంత్రి సురేశ్ గోపి, కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్  ఇతర మంత్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.