సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం సన్ ఆఫ్. బత్తుల సతీష్ దర్శకత్వం. ఈ నేపథ్యంలో గురువారం ఊసులాడే అనే పాటను విడుదల చేశారు. భాస్కరభట్ల రచించిన ఈ గీతానికి రిషి ఎం సంగీతాన్నందించారు. ఆదిత్య, సమీర భరద్వాజ్ ఆలపించారు. ప్రేమబంధంలోని మధురానుభూతులకు అద్దం పట్టే గీతమిదని దర్శకుడు తెలిపారు. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ కథలో చక్కటి సందేశం ఉంటుందని హీరో పేర్కొన్నారు. మీరారాజ్, వినోద్‌కుమార్, వాసు ఇంటూరి తదితరులు నటించారు.ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: రిషి ఎం, రచన-దర్శకత్వం: బత్తుల సతీష్.


