గూగుల్ లాంటి సంస్థల రాకతో ఎఐ డేటా హబ్ గా విశాఖ మారుతుందని ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ఆకాంక్షతో ప్రధాని నరేంద్రమోడీ పనిచేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మోడీ ఆకాంక్షను దేశం సాధించి తీరుతుందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలను సాధిస్తుందన్న విశ్వాసం ఉందని తెలియజేశారు. పౌరులందరికీ లబ్ధి కలిగేలా సావరిన్ ఎఐ వినియోగానికి ప్రయత్నిస్తున్నామని, డీప్ టెక్నాలజీలో మరింత ముందుకెళ్లేలా ఎపి దృష్టి సారిస్తోందని సిఎం పేర్కొన్నారు. ఎపిలో స్పేస్, డ్రోన్, మెడ్ టెక్ పార్క్ లాంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయని, పెట్టుబడుల ఆకర్షణతో పాటు క్వాంటం ఎకో సిస్టం తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.


