My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - NRI

డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ..ఎప్పుడంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ఖరారైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆయన మూడు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు జరపనున్నారు. ఈ మేరకు వైట్‌హౌస్ అధికారి ఒకరు  అధికారికంగా పర్యటన తేదీలను ధ్రువీకరించారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించి, ఆర్థిక సంబంధాలను చక్కదిద్దడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఇరు […]

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ఖరారైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆయన మూడు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు జరపనున్నారు. ఈ మేరకు వైట్‌హౌస్ అధికారి ఒకరు  అధికారికంగా పర్యటన తేదీలను ధ్రువీకరించారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించి, ఆర్థిక సంబంధాలను చక్కదిద్దడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఇరు దేశాధినేతలు నేరుగా చర్చలు జరిపి కీలక అంశాలపై స్పష్టతకు రానున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో దక్షిణ కొరియాలో ఇరువురు నేతలు వాణిజ్య యుద్ధ విరమణకు తాత్కాలికంగా అంగీకరించారు. ఆ ఒప్పందాన్ని పొడిగించే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.