అల్లు కుటుంబంలో శుభకార్యం సందడి మొదలైంది. అల్లు శిరీష్ తాను ప్రేమించిన నయనికతో మార్చి 6న వివాహ బంధంలో అడుగుపెట్టనున్నాడు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వెడ్డింగ్ కార్డుల పంపిణీతో పాటు ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి. తమ్ముడి పెళ్లి సందర్భంగా అల్లు అర్జున్ ప్రత్యేకంగా ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
అల్లు శిరీష్, అతనికి కాబోయే భార్య నయనిక, అల్లు అర్జున్ , ఆయన భార్య స్నేహారెడ్డి, అలాగే రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన కలిసి కనిపించారు. మెగా–అల్లు కుటుంబానికి చెందిన కజిన్స్ అంతా ఒకే ఫ్రేమ్‌లో మెరిసిపోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పార్టీకి హాజరైన వారంతా బ్లాక్ డ్రెస్ కోడ్‌లో రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫొటోలో మరో విశేషం ఏంటంటే రామ్ చరణ్ అయ్యప్ప మాల ధరించి కనిపించడం. చరణ్ సమయం దొరికినప్పుడల్లా అయ్యప్ప మాల వేసుకుంటారని తెలిసిందే.


