బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె తాజాగా మరో బంపరాఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు అమర్ కౌశిక్ బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి మహావతార్ అనే చిత్రాన్ని రూపొందించబోతున్న విషయం తెలిసిందే. మైథాలాజీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాలో కథానాయికగా దీపికాను తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి సంప్రదింపులు జరుపగా దీపికా కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. పరశురాముడి జీవిత కథ ఆధారంగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొణె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని, ఆ పాత్రకు ఆమె వంద శాతం న్యాయం చేయగలరని చిత్ర యూనిట్ బలంగా విశ్వసిస్తోందట. అందుకే ఆమెను తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన దర్శకుడు అమర్ కౌశిక్, ఇప్పటికే ఆరు నెలల నుంచి ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఇది తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన సినిమా అవుతుందని పేర్కొన్నారు.


