మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిని ప్రజలు ఆదరించారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు మున్సిపాలిటీలు తక్కువ వచ్చినప్పటికీ ఓట్ల శాతం పెరిగిందని, బిజెపికి ఓటు వేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. గత ఎన్నికలతో పోలిస్తే బిఆర్ఎస్ కు 14 శాతం ఓట్లు తగ్గాయని, చాలా మున్సిపాలిటీలో బిజెపి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆధిక్యం చూపిందని అన్నారు. బిఆర్ఎస్ 13 మున్సిపాలిటీలకే పరిమితమైందని, భైంసాలో మజ్లిస్ ఆగడాలు తట్లుకోలేక చాలా మంది వెళ్లిపోయారని చెప్పారు. భైంసాలో మొదటిసారి బిజెపి గెలిచిందని ఇది చరిత్రాత్మకం అని కొనియడారు. చాలా చోట్ల బిజెపికి వైస్ చైర్మన్ పదవులు దక్కాయని, 25 మున్సిపాలిటీల్లో బిజెపి నిర్ణయాత్మక శక్తిగా ఉన్నామని రాంచందర్ రావు పేర్కొన్నారు.


