స్పేస్ఎక్స్ కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ ఇప్పుడు ట్రిలియనీర్ అయ్యారు. ఆయన సంపద ఇప్పుడు లక్ష కోట్లు దాటేసింది. తాజాగా ఆ కంపెనీ ఐపీవో సేల్స్ జరిగాయి. హాట్‌కేకుల్లా ఆ కంపెనీ షేర్లు అమ్ముడుపోయాయి. అనూహ్య రీతిలో ఆయన సంపద పెరిగిపోయింది. హేమీహేమీ టైకూన్లను దాటివేస్తూ, ఔత్సాహిక వ్యాపారి దశ నుంచి ట్రిలియనీర్‌గా ఆయన ఎదిగారు. రాకెట్లు, శాటిలైట్లు, ఏఐ కంపెనీలు, టెస్లా కార్లు, మస్క్ వ్యాపారంలో ఉన్నాయి. అయితే తాజా ఐపీవో ద్వారా స్పేస్ఎక్స్ కంపెనీ 75 బిలియన్ల డాలర్లు ఆర్జించింది. ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్‌లో పెట్టుబడిదారులు ఉత్సాహంతో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో ఐపీవో సేల్‌లో ఒక్కొక్క షేర్‌ను 135 డాలర్లకు అమ్మేశారు. దీంతో మస్క్ రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్ తయారీ కంపెనీ విలువ అమాతం పెరిగింది. మొత్తం 555.56 మిలియన్ల షేర్లను అమ్మేశారు. దాంతో ఆ కంపెనీకి ఐపీవో ద్వారా సుమారు 75 బిలియన్ల డాలర్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో స్పేస్, శాటిలైట్, ఏఐ కంపెనీల మొత్తం విలువు సుమారు 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నది.


