బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా పేరున్న రాఖీ సావంత్ ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని, విడాకులు తీసుకున్న ఆమె మూడో పెళ్లి గురించి మాట్లాడుతూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రాపై సెటైర్లు వేసింది. ప్రియాంకా చోప్రా తనకంటే వయసులో చాలా చిన్నవాడైన నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకోవడాన్ని ఉద్దేశించి రాఖీ వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది.నా వయస్సులో సగం వయస్సున్న కుర్రాళ్లను ఇష్టపడేందుకు తానేమీ ప్రియాంకా చోప్రాను కాదని రాఖీ సావత్ ఆమె వ్యక్తిగత జీవితం గురించి కామెంట్ చేసింది. ఆ వెంటనే ప్రియాంకా చోప్రా అందాన్ని పొగిడింది. ప్రియాంకా చోప్రా వయస్సు పెద్దగా కనిపించదని, ఆమె యువతిలా ఉంటుందని వ్యాఖ్యానించింది. చూడటానికి నిక్ జొనాస్ కంటే ప్రియాంకా చోప్రానే చిన్నదానిలా కనిపిస్తుందని పేర్కొన్నది. తన వెంట 16, 17, 18 ఏళ్ల వయస్సున్న కుర్రాళ్లు పడుతుంటారని, కానీ ఆ వయస్సు కుర్రాళ్లు తనకు నచ్చరని రాఖీ సావంత్ చెప్పింది. కుర్రాడిని బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకోవడానికి నేనేమీ ప్రియాంకా చోప్రాని కాదని వ్యాఖ్యానించింది. తాను తన వయస్సు మగవాళ్లనే ఇష్టపడతానని చెప్పింది.


