My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

జాన్వీ క‌పూర్ బ‌ర్త్‌డే స్పెషల్ … పెద్ది నుంచి సర్‌ప్రైజ్

రామ్ చరణ్ హీరోగా,  బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం పెద్ది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈరోజు తన 29వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఆమెకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. కాటుక అక్క‌ర్లేని ఆ కళ్లు, ముక్కుపుడ‌క అక్క‌ర్లేని ఆ ముక్కు అంటే అలంక‌ర‌ణ అక్క‌ర్లేని అరుదైన చికిరియే ఈ చికిరి అంటూ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు […]

రామ్ చరణ్ హీరోగా,  బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం పెద్ది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈరోజు తన 29వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఆమెకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. కాటుక అక్క‌ర్లేని ఆ కళ్లు, ముక్కుపుడ‌క అక్క‌ర్లేని ఆ ముక్కు అంటే అలంక‌ర‌ణ అక్క‌ర్లేని అరుదైన చికిరియే ఈ చికిరి అంటూ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌నా జాన్వీని ప్ర‌శంసిస్తూ ఉన్న ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ సినిమాలో జాన్వీ అచ్చియమ్మ అనే పల్లెటూరి యువతి పాత్రలో నటిస్తుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సహకారంతో వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.