తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర. ఈ జాతరకు సంబంధించిన బంగారం ప్రసాదంను టిజిఎస్ ఆర్టీసి భక్తులకు ఇంటికే తెచ్చి ఇచ్చేలా ఏర్పాట్లు చేయనుంది. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఈ పథకాన్ని ఆర్టీసీ ప్రారంభించింది. గతంలోనూ ఇటువంటి ప్రయత్నం చేసిన ఆర్టీసి ఇందుకు సంబంధించి ప్రసాదంను ఎలా ఆన్‌లైన్ లో బుక్ చేసుకోవాలో తెలిపే పోస్టర్ను ఆర్టీసీ ఎండి వై నాగిరెడ్డి విడుదల చేశారు. మేడారం బంగారం ప్రసాదం బుకింగ్కు సంబంధించిన పోస్టర్ను ఆర్టిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకన్న, సి.టి. ఎం (మార్కెటింగ్ అండ్ కమర్షియల్) శ్రీధర్, ఏటిఎం రాజన్తో కలిసి ఆర్టిసి వైస్ఛెర్మన్, ఎండి వై నాగిరెడ్డి ఆవిష్కరించారు. మరింత సమాచారం కోసం టిజిఎస్ఆర్టిసి కాల్ సెంటర్లు 040-69440069, 040-23450033 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 28 నుండి 31వ తేదీ వరకు జరుగనున్న సంగతి తెలిసిందే.


