భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను పోలుస్తూ జియోపాలిటిక్స్ నిపుణుడు ఇయాన్ బ్రెమ్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రెమ్మర్ ట్రంప్ తీసుకున్న వెనిజులా నిర్ణయాలు స్వల్పకాలిక లాభాలను ఇవ్వవచ్చని అంగీకరించినప్పటికీ, ట్రంప్ పదవీ విరమణ అనంతరం అవి కొనసాగడం కష్టమని అభిప్రాయపడ్డారు. అమెరికాలో ప్రతి నాలుగు సంవత్సరాలకు నాయకత్వం మారే నరపజాస్వామ్య వ్యవస్థ కారణంగా విధానాల్లో స్థిరత్వం ఉండదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా కంపెనీలు వెనిజులా చమురు మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటాయన్న అంచనాలను బ్రెమ్మర్ అతిశయోక్తిగా కొట్టిపారేశారు.
భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ దశాబ్దానికి పైగా బలమైన ప్రజాదారణతో పాలన కొనసాగించడం ఒక ప్రధాన తేడా అని చెప్పారు. చైనా, రష్యా, భారత్ వంటి దేశాల్లో నాయకత్వానికి స్థిరత్వం ఉండగా, అమెరికాలో అది కొరవడిందని ఆయన అన్నారు. తదుపరి అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న చాలా నిర్ణయాలను సులభంగా రద్దు చేయగలడు. ఇది చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కాదు, పది సంవత్సరాలుగా దేశాన్ని నడుపుతున్న మోడీ కూడా కాదు. ఇది ట్రంప్ పాలన, ప్రజాదరణ తక్కువగా ఉన్న నాయకుడు, మూడు సంవత్స రాల్లో పదవి విడిచిపెట్టాల్సి వస్తుందని బ్రెమ్మర్ వ్యాఖ్యానించారు.


