మేడారం మహా జాతర కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గద్దెలపై పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుదీరారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గోవిందరాజును బుధవారం ఉదయం 6 గంటలకు, పగిడిద్దరాజును 9.45 గంటలకు పూజారులు ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, జాతర కార్యనిర్వహణాధికారి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులను గద్దెల ప్రాంగణంలోకి రానివ్వకుండా భద్రత ఏర్పాట్లు చేపట్టారు. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు పూజారులు కుటుంబాలతోపాటు హాజరై పూజా కార్యక్రమాల ను విజయవంతంగా నిర్వహించారు. మేడారం జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరుగనుంది. దీనికి తెలంగాణతోపాటు చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల నుంచి కోటి మందికిపైగా భక్తులు తరలి వస్తారని అంచనా.


