ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరుగుతున్న మేడారం జాతరను న్యూజిలాండ్ మావోరి తెగకు చెందిన ప్రతినిధులు సందర్శించారు.ఈ సందర్భంగా గద్దల ప్రాంగణంలో వారి హాకా నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. తెలంగాణ, న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా పంచాయతీ రాజ్, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో మావోరి తెగ ప్రతినిధులు మేడారం మహాజాతరను సందర్శించారు. హాకా నృత్య ప్రదర్శన మంత్రి సీతక్క స్వయంగా కళాకారులతో కలిసి నృత్యం చేసి వారిలో ఉత్సాహాన్ని పెంచారు. హాకా నృత్యం అనేది మావోరి తెగలో యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో తమ సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు, శత్రువుల్లో భయాన్ని కలిగించే విధంగా చేసే సంప్రదాయ నృత్యంగా ప్రసిద్ధి చెందిందని వారు తెలిపారు.


