తెలంగాణ రాజకీయాల్లో త్వరలో సంచలనం జరగబోతుందని టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు చేతిలోకి తెలంగాణ బీజేపీ రిమోట్ కంట్రోల్ వెళ్లిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు చేతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలు బొమ్మల్లా మారిపోయారని అన్నారు. ఇక నుంచి హరీష్ కార్యక్రమాలను కేటీఆర్ కంటే ఎక్కువగా ప్రచారం వచ్చే విధంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక చేస్తోందని చెందారు. తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు కీలక నేతలు హరీష్ రావు, ఈటల రాజేందర్ వ్యూహంలో ఇప్పుడు బీజేపీ చిక్కిందని అన్నారు.


