తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం విలువ రూ.3,24,234 కోట్లుగా ఆయన వెల్లడించారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లుగా, మూలధన వ్యయం రూ.47,267 కోట్లు, తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర వృద్ధి రేటు 10.2 శాతమని ప్రకటించారు.
తెలంగాణ శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, తమ ప్రభుత్వ లక్ష్యాలను మరియు ప్రాధాన్యతలను సభకు వివరించారు. ప్రజలే మాకు పరామావధి. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే ఈ గొప్ప అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని భట్టి విక్రమార్క తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.3,24,234 కోట్లుని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అందులో రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లని, మూలధన వ్యయం రూ.47,267 కోట్లని తెలిపారు. ఇక రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లుగా ఉందని, వృద్ధి రేటు 10.20 శాతంగా ఉందన్నారు. జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు 2.7శాతం ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం 1.9 రెట్లు పెరిగిందని తెలపారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్నామని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్ అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
శాఖల వారీగా కేటాయింపులు ఇలా..
పశు సంవర్థక శాఖకు 1,529కోట్లు
విద్యుత్ శాఖకు 21,285 కోట్లు
విద్యా శాఖ కు 26,674కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖకు 13,679 కోట్లు
కార్మిక శాఖకు 998కోట్లు
మహిళా శిశు సంక్షేమ శాఖకు 3,143 కోట్లు
ఎస్సీ సంక్షేమానికి 11,784కోట్లు
ఎస్టీ సంక్షేమానికి 7,937 కోట్లు
బీసీ సంక్షేమానికి 3,769 కోట్లు
రాజీవ్ యువ వికాసానికి 6 వేల కోట్లు
గృహ నిర్మాణ శాఖకు 7,430కోట్లు


