My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - Telangana

తెలంగాణ పోలీసు శాఖ  కీలక నిర్ణయం …విధుల్లో దీక్షలు నిషేధం

అయ్యప్ప మాల సహా ఇతర ఆధ్యాత్మిక దీక్షలపై తెలంగాణ పోలీసు శాఖ  కీలక నిర్ణయం తీసుకుంది. మతపరమైన దీక్షల్లో ఉన్న పోలీసులు విధుల్లోకి రావద్దని, డ్యూటీలో ఉన్న సమయంలో ఎలాంటి మతాచారాలు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. యూనిఫామ్‌ ప్రమాణాలు, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే విధంగా జుట్టు, గడ్డం పెంచడం, సాధారణ దుస్తులతో డ్యూటీ చేయడం, బూట్లు లేకుండా విధుల్లో ఉండటం కఠినంగా నిషేధించబడింది.  డ్యూటీలో  ఉన్నప్పుడు నిబంధ‌న‌లు ఉల్లంఘించి అయ్యప్ప మాల ధరించిన కంచన్‌బాగ్ […]

అయ్యప్ప మాల సహా ఇతర ఆధ్యాత్మిక దీక్షలపై తెలంగాణ పోలీసు శాఖ  కీలక నిర్ణయం తీసుకుంది. మతపరమైన దీక్షల్లో ఉన్న పోలీసులు విధుల్లోకి రావద్దని, డ్యూటీలో ఉన్న సమయంలో ఎలాంటి మతాచారాలు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. యూనిఫామ్‌ ప్రమాణాలు, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే విధంగా జుట్టు, గడ్డం పెంచడం, సాధారణ దుస్తులతో డ్యూటీ చేయడం, బూట్లు లేకుండా విధుల్లో ఉండటం కఠినంగా నిషేధించబడింది.  డ్యూటీలో  ఉన్నప్పుడు నిబంధ‌న‌లు ఉల్లంఘించి అయ్యప్ప మాల ధరించిన కంచన్‌బాగ్ ఎస్సై కృష్ణకాంత్‌పై సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ మెమో జారీ చేయడం జ‌రిగింది.యూనిఫామ్ తప్పకుండా ధరించాలి, జుట్టు, గడ్డం పెంచకూడదు, సివిల్ డ్రెస్సులో, బూట్లు లేకుండా డ్యూటీ నిషేధం, మత దీక్షలో ఉంటే ముందుగానే సెలవు తీసుకోవాలి అని సదరు డీసీపీ హుకుం జారీ చేశారు. పోలీసు ఉన్నతాధికారుల ప్రకారం, అయ్యప్ప దీక్ష వంటి మతపరమైన నియమాలు పోలీసు బాధ్యతలతో కుదరవని భావించి, ముందస్తు అనుమతి తీసుకుంటే రెండు నెలల వరకు సెలవులు కూడా మంజూరు చేసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కానిస్టేబుల్‌ నుంచి ఐపీఎస్ స్థాయి వరకు అనేక మంది పోలీసు సిబ్బంది అయ్యప్ప దీక్షలు చేపడుతున్న నేపథ్యంలో, యూనిఫామ్‌ డిసిప్లిన్‌ ప్రభావితం కావొచ్చన్న ఆందోళనలతో ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.