మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తమ ప్రమేయం ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల ప్రకారమే స్టేషన్ బెయిల్ ఇచ్చారు. దీనిలో మా ప్రమేయం ఏమీ లేదు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశాం అని చెప్పారు. 2029లో తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని అన్నారు. 2028లో ఎన్నికలు రావని తెలిపారు. మహిళ రిజర్వేషన్లు ముందుగా అమల్లోకి వస్తే మంచిదని అభిప్రాయపడ్డారు.
అంతకముందు పార్లమెంట్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డిని వారికి పరిచయం చేశారు. ఈ పర్యటనలో రేవంత్‌తో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు.


