My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

లోక్‌సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. 298 మంది సభ్యులు అనుకూలంగా, 230 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడానికి, జనాభా గణన లేకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి ఉద్దేశించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును లోక్‌సభ తిరస్కరించింది. కాగా, లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందడానికి కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమికి 326 ఓట్లు అవసరం. సభలో ఈ బిల్లుపై ఓటింగ్‌ సందర్భంగా […]

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. 298 మంది సభ్యులు అనుకూలంగా, 230 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడానికి, జనాభా గణన లేకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి ఉద్దేశించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును లోక్‌సభ తిరస్కరించింది.

కాగా, లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందడానికి కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమికి 326 ఓట్లు అవసరం. సభలో ఈ బిల్లుపై ఓటింగ్‌ సందర్భంగా మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొన్నారు. 298 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా, 230 మంది సభ్యులు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో జనాభా గణన లేకుండానే నియోజకవర్గాల పునర్విభజనతో ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. సభలో జరిగిన ఓటింగ్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించలేకపోవడం వల్ల, రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదం పొందలేదని స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.