గత ఐదుసంవత్సరాలుగా రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఎడతెరపి లేకుండా కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపేందుకు తనవంతు కర్తవ్యంగా శక్తివంచన లేకుండా కృషి చేశారు. అయినా యుద్ధం మాత్రం ఆగడం లేదు. పలుదఫాలుగా ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీలతో చర్చలు జరిపినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతున్నది. యుద్ధం వల్ల ఇప్పటికే రెండుదేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఆర్థికంగా, సైనికపరంగా, ఆయుధాల పరంగా తీవ్రనష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. అయినా పుతిన్ మాత్రం యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదని చెబుతున్నారు. తాజ కాగా పుతిన్ పై హత్యాయత్నం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయనకు అత్యంత శక్తివంతమైన భద్రతా వలయం ఉంటుంది.
అయితే ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం నేపధ్యంలో కొన్ని నెలల క్రితం నోవ్ గోరోడ్ ప్రాంతంలోని ప్రైవేటు నివాసం వద్ద పుతిన్ పై హత్యాయత్నానికి పాల్పడినట్లు మాస్కో అధికారులు తెలిపారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదని వారు పేర్కొన్నారు. దీంతో వ్లాదిమిర్ పుతిన్ కు ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ (ఎఫ్ ఎస్ ఓ) మరింత కట్టుదిట్టమైన రక్షణను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన తదనంతరం పుతిన్ బహిరంగ పర్యటనలను చాలావరకు తగ్గించుకుంటున్నట్లు సమాచారం.


