సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా సుధీర్స్ జోకర్ పేరుతో ఓ సినిమా రూపొందుతున్నది. అయేషా కథానాయికగా పరిచమం అవుతున్న ఈ చిత్రానికి పీఎస్ సునీల్ పుప్పాల దర్శకుడు. విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మాతలు. చిత్ర కథానాయిక అయేషా పుట్టినరోజు సందర్భంగా, ఇందులో ఆమె పోషిస్తున్న షాలినీ అనే పాత్రను పరిచయం చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు అందించారు. ఈ సినిమాలో షాలినీగా తన నటనతో ప్రేక్షకుల్ని అయేషా అలరిస్తుందని, హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కెమెరా: అహ్మద్ షరీఫ్, సంగీతం: లియోన్ జేమ్స్.

































