ఇరాన్ ఓడరేవుల దిగ్భంధం ఎత్తి వేయాలని ఆదేశించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.ఈ సందర్బంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ సుంకం లేకుండా హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని అన్నారు. ఇరాన్ తో శాంతి ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించారు. ప్రపంచంలోని నౌకలు.. తమ ఇంజిన్లను స్టార్ట్ చేయండని, హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయండని సూచించారు. శాంతి ఒప్పందానికి సహకరించిన అందరికీ అభినందనలు ట్రంప్ తెలియజేశారు.

































