కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన బ్యాంకింగ్ సవరణ చట్టం కారణంగా నవంబర్ నెలలో కొన్ని మార్పులు జరుగనున్నాయి. బ్యాంక్ ఖాతా నామినీలకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. అకౌంట్ హోల్డర్ కి ఒక నామినీ మాత్రమే ఉండటం వల్ల ఆ నామినీ అందుబాటులో లేకపోవడం, నగదు క్లెయిమ్ చేసుకోకపోవడంతో ఆ డబ్బు అలాగే ఉండిపోతుంది. ఇలా మన దేశంలోని మన బ్యాంకుల్లో దాదాపు రూ.67,000 కోట్లకు పైగా డబ్బు అలాగే ఉండిపోయింది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ఖాతాదారుడికి ఒక్కరు నామినీ కాకుండా, నలుగురు నామినీలుగా ఉండేందుకు అవకాశం కల్పించింది. ఈ నామినీలకు ఎవరెవరికి ఎంతెంత శాతం డబ్బు కేటాయించాలనేది అకౌంట్ హోల్డర్ నిర్ణయించుకోవచ్చు. ఖాతాదారుడి నిర్ణయం మేరకు నామినీలకు చివరి మొత్తాన్ని బ్యాంక్ అందజేస్తుంది. ఖాతాదారుడి మరణానంతరం డబ్బు విషయంలో వారసత్వ గొడవలు, చట్టపరమైన సమస్యలు నివారించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రూల్ నవంబర్ 1 నుంచి అమలులోకి రానుంది.


