ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం అగధ. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్‌ను నేడు విడుదల చేయగా, ఈ టీజర్ ఈవెంట్‌లో ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ ఆయన నిర్మాణంలో వచ్చిన దేవి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక భయానక సంఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు.
దేవి సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో సెట్‌లో వనిత విజయ్ కుమార్‌ను నిజంగానే ఒక పాము కాటేసింది. ఆ సమయంలో సెట్‌లో ఉన్న యూనిట్ సభ్యులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రాణాపాయం ఉంటుందేమోనని అందరూ టెన్షన్ పడుతుంటే, వనిత మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. తనకు ఏమీ కాదని, అమ్మవారే తనను కాపాడుతుందని ఆమె ఎంతో నమ్మకంతో చెప్పినట్లు ఎం.ఎస్. రాజు చెప్పుకోచ్చాడు.


