అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్ క్రికెటర్ అమేలియా కేర్ చరిత్ర సృష్టించింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లో చెలరేగిపోతున్న కివీస్ కెప్టెన్ రెండో టీ20 మ్యాచ్‌లో వందో వికెట్ సాధించింది. తద్వారా టీ20ల్లో ఆమె అరుదైన మైలురాయిని అధిగమించింది. పొట్టి ఫార్మాట్‌లో అత్యంత వేగంగా వెయ్యికి పైగా పరుగులు బాదేసి, వందకు పైగా వికెట్లు తీసిన మహిళా క్రికెటర్‌గా అమేలియా అవతరించింది. ఈ ఆల్‌రౌండర్ 94వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ సొంతం చేసుకుంది. సంచలనాలకు నెలవైన టీ20ల్లో అమేలియా కేర్ జోరు కొనసాగిస్తోంది. ఇటీవల కాలంలో బ్యాటుతో, బంతితో చెలరేగిపోతున్న కివీస్ క్రికెటర్. నిరుడు టీ20ల్లో తొలి సెంచరీతో రికార్డులకెక్కింది. తాజాగా స్వదేశంలో దక్షిణాఫ్రికాపై పంజా విసురుతున్న అమేలియా అత్యంత వేగంగా వంద వికెట్ల క్లబ్‌లో చేరింది.


