తెలంగాణ రాష్ట్రంలోని కొండ గట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సహకారం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిధులు మంజూరు చేసింది. టీటీడీ నుంచి రూ.35.19 కోట్ల నిధులతో సత్రం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలు చేయనున్నారు. రేపు (జనవరి 3) పవన్ కల్యాణ్ కొండగట్టుకు వెళ్లి, ఈ నిర్మాణాల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. శనివారం ఉదయం 10గం.30ని. నుంచి 11 గం.30ని. మధ్య డిప్యూటీ సీఎం పవన్ కొండగట్టు క్షేత్రంలో పర్యటించనున్నారు.


