My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

భోగి నుంచి అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ రిలీజ్‌

టాలీవుడ్ న‌టుడు శర్వానంద్ కథానాయకుడిగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా భోగి. ప్ర‌స్తుతం ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుడ‌గా తాజాగా ఈ సినిమా నుంచి కథానాయిక అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ఈ సినిమాలో అనుప‌మ కందుల సులోచ‌నా రాణి అనే గ్రామీణ యువ‌తిగా క‌నిపించ‌బోతుంది. చేతిలో క్యారేజీ, మోదుగ ఆకులు ప‌ట్టుకుని ఉన్న పోస్ట‌ర్ ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. 1960ల నాటి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు […]

టాలీవుడ్ న‌టుడు శర్వానంద్ కథానాయకుడిగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా భోగి. ప్ర‌స్తుతం ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుడ‌గా తాజాగా ఈ సినిమా నుంచి కథానాయిక అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ఈ సినిమాలో అనుప‌మ కందుల సులోచ‌నా రాణి అనే గ్రామీణ యువ‌తిగా క‌నిపించ‌బోతుంది. చేతిలో క్యారేజీ, మోదుగ ఆకులు ప‌ట్టుకుని ఉన్న పోస్ట‌ర్ ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. 1960ల నాటి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో ఈ సినిమా సాగ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ఈ హై-వోల్టేజ్ డ్రామాలో శర్వానంద్ ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండగా, అనుపమ పరమేశ్వరన్ మరియు డింపుల్ హయాతీ ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 28, 2026 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.