జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్‌భవన్ చేరుకున్న ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. నితీశ్‌కుమార్ స్థానంలో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజీనామాను సమర్పించడానికి ముందు ఆయన మంత్రివర్గ సమావేశాన్ని చివరిసారిగా ఏర్పాటుచేశారు. మంత్రివర్గాన్ని రద్దు చేస్తున్న విషయాన్ని కేబినెట్‌కు తెలియజేశారు. నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా రెండు దశాబ్దాలు కొనసాగారు. ఇటీవల ఆయన రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారంచేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.


