ఉత్తరాది, దక్షిణాది అని పదపదే మాట్లాడుతూ దేశాన్ని విభజించాలని కుట్రలు చేసిన వాళ్లకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తగిన గుణపాఠం చెప్పాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ రావుతో కలిసి కరీంనగర్ లోని వెంకటాద్రి, రేనే ఆసుపత్రులకు వెళ్లిన బండి సంజయ్ కుమార్ పిఎంజే జువెలర్స్ దోపిడీ ఘటనలో గాయపడ్డ బాధితులను పరామర్శించారు. వారితో నేరుగా మాట్లాడారు. తదుపరి మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ ముఖ్యంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతోందంటూ గగ్గోలు పెట్టిన తమిళనాడు సిఎం స్టాలిన్, తోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ది చెప్పారు. బిజెపి కార్యకర్తల పోరాటాలు, త్యాగాలవల్లే బెంగాల్ లో అధికారం దక్కిందని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ బిజెపి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.


