మాజీ ఎమ్మెల్సీ కవిత రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేన(టిఆర్ఎస్)పై బిఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టిఆర్ఎస్ పేరు తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉందని, అందువల్ల ఆ పేరు కేటాయించ వద్దని ఇసిని కోరింది. ఇప్పటికీ ప్రజలు బిఆర్ఎస్‌ను టిఆర్ఎస్‌గానే గుర్తిస్తారని పేర్కొంది. టిఆర్ఎస్ పేరుపై ఇసి దాదాపు 700 అభ్యంతరాలు అందాయి. కవిత పార్టీపై అభ్యంతరాలు చెప్పుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘటం గతంలో సూచించిన విషయం తెలిసిందే.

































