My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

రామాయణ టీజర్‌కు సెన్సార్ క్లియరెన్స్

రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం రామాయణ. దాదాపు రూ.3000 కోట్ల బ‌డ్జెట్‌తో రాబోతున్న ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌గా, తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (ఛ్భ్Fఛ్) క్లియరెన్స్ ఇచ్చింది. ఈ చిత్రం నుంచి రామ పేరుతో రాబోతున్న ఈ టీజర్ విడుదలకు ముందు సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏప్రిల్ 2న టీజర్ […]

రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం రామాయణ. దాదాపు రూ.3000 కోట్ల బ‌డ్జెట్‌తో రాబోతున్న ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌గా, తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (ఛ్భ్Fఛ్) క్లియరెన్స్ ఇచ్చింది. ఈ చిత్రం నుంచి రామ పేరుతో రాబోతున్న ఈ టీజర్ విడుదలకు ముందు సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏప్రిల్ 2న టీజర్ విడుదల చేయడానికి మార్గం సుగమమైంది. దీనితో పాటు ఈ టీజర్ నిడివికి సంబంధించిన‌ వివరాలు కూడా వెల్లడయ్యాయి. ప్ర‌స్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, రామ టీజర్ రన్‌టైమ్ 2 నిమిషాల 38 సెకన్లుగా ఉంది. ఈ టీజర్‌కు సెన్సార్ బోర్డు యూనివర్సల్(యు) రేటింగ్ ఇచ్చింది, దీంతో ఈ టీజ‌ర్‌ను అన్ని వయసుల వారు థియేట‌ర్‌ల‌లో వీక్షించవచ్చు.

ఇప్పటివరకు చిత్రబృందం కేవలం టైటిల్ వీడియోతో పాటు 3 నిమిషాల 3 సెకన్ల నిడివి గల ‘రామాయణ: ది ఇంట్రడక్షన్’ అనే క్లిప్‌ను మాత్రమే పంచుకుంది. భారీ వీఎఫ్ఎక్స్ హంగులతో కూడిన ఆ వీడియోలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా కన్నడ స్టార్ యష్ లుక్‌లకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ల‌ను చూపించారు.అయితే ఇప్పుడు రాబోతున్న టీజ‌ర్ ఎలా ఉండ‌బోతుంద‌ని అంద‌రూ ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ దృశ్యకావ్యం 2026 నవంబర్‌లో దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.