ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ స్పందించారు. చంద్రబాబుకు ఈ అవార్డు రావడం రాష్ట్రానికి గర్వకారణం. రాష్ట్రంతో పాటు మా కుటుంబానికి ఇది ఎంతో ప్రతిష్ఠాత్మకం. సంస్కరణలను చంద్రబాబు ధైర్యంగా ముందుకు తీసుకెళ్లారని జ్యూరీ ప్రశంసించింది. పాలనలో సంస్కరణలు, వేగం, విశ్వాసంపై చూపిన నిబద్ధతకి ఈ అవార్డు నిదర్శనం. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది. పెట్టుబడుల ఆకర్షణ, సంస్కరణాత్మక పాలనకు సీఎం స్ఫూర్తిగా నిలుస్తున్నారు అని లోకేశ్ పేర్కొన్నారు.


