My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

సీఎం మమతా బెనర్జీ గుడ్‌ న్యూస్‌ …వారికి నెలకు రూ. 1,500

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు మరో ఉచిత పథకానికి శ్రీకారం చుట్టారు. పదో తరగతి పాసైన నిరుద్యోగ యువతకు నెలకు రూ.1,500 ఇస్తామని ప్రకటించారు. మార్చి 7, శనివారం నుంచే యువ సతి పేరుతో ఈ పథకం ప్రారంభమవుతుందని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  జరిగిన ఒక కార్యక్రమంలో మమతా బెనర్జీ ఈ ప్రకటన చేశారు. నిజానికి ఈ పథకం ఏప్రిల్ […]

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు మరో ఉచిత పథకానికి శ్రీకారం చుట్టారు. పదో తరగతి పాసైన నిరుద్యోగ యువతకు నెలకు రూ.1,500 ఇస్తామని ప్రకటించారు. మార్చి 7, శనివారం నుంచే యువ సతి పేరుతో ఈ పథకం ప్రారంభమవుతుందని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  జరిగిన ఒక కార్యక్రమంలో మమతా బెనర్జీ ఈ ప్రకటన చేశారు.

నిజానికి ఈ పథకం ఏప్రిల్ నుంచి ప్రారంభం కావాలని, కానీ, ఈ రోజు నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ప్రకారం పదో తరగతి పాసైన 21-40 ఏళ్ల మధ్య గల యువతీ యువకులకు ప్రతి నెలా నిరుద్యోగ భృతి కింద ప్రతి నెలా రూ.1,500 ప్రభుత్వం నుంచి అందుతాయి. ఈ రోజు నుంచే ఈ పథకం ప్రారంభమవుతుంది. అయితే, నిరుద్యోగులకే కాకుండా ఇతర చదువులు చదువుతున్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. అంటే ఉద్యోగం, వేతనాలు లేకుంటే చాలు ఈ పథకాన్ని పొందవచ్చు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.