కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో ఢిల్లీలోని ఆయన నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంయుక్తంగా భేటీ అయ్యారు.ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణ ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి రుణం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి నిన్న(సోమవారం) కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో రేవంత్ సమావేశమయ్యారు. మెట్రో రైల్ విస్తరణపై సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న నేను రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎల్లవేళలా పనిచేస్తా అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

































