My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - Telangana

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌

తెలంగాణ నూతన  డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఎస్సీ ఎంపానెల్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం సీవీ ఆనంద్ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన డీజీపీగా ప్రమోషన్ పొందనున్నారు. ఈ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ నియామకం అమల్లోకి వస్తుంది. తెలంగాణ ప్రస్తుత డీజీపీ కె. శివధర్ రెడ్డి ఏప్రిల్ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో […]

తెలంగాణ నూతన  డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఎస్సీ ఎంపానెల్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం సీవీ ఆనంద్ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన డీజీపీగా ప్రమోషన్ పొందనున్నారు. ఈ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ నియామకం అమల్లోకి వస్తుంది. తెలంగాణ ప్రస్తుత డీజీపీ కె. శివధర్ రెడ్డి ఏప్రిల్ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ బాస్‌గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు.

ఏప్రిల్ నెలాఖరులో ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ ఎంపిక అనివార్యమైంది. అందుకు రాష్ట్రంలోని సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు జాబితాను ఇటీవల యూపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఆ జాబితాలో 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌తోపాటు 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యా మిశ్రా ఉన్నారు. వారిలో సీనియర్ అయిన సీవీ ఆనంద్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీజీపీగా ఎంపిక చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.