My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్

ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. కోర్టు ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అంటే కోర్టు నియమాల ఉల్లంఘనే అంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ వి కామేశ్వర్ రావు, జస్టిస్ మన్‌మీత్ అరోరా ఆధ్వర్యంలోని బెంచ్ ఈ కేసును విచారిస్తూ  నోటీసులు జారీ చేశారు. అంతేకాదు, దీనికి సంబంధించిన వీడియోలను […]

ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. కోర్టు ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అంటే కోర్టు నియమాల ఉల్లంఘనే అంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ వి కామేశ్వర్ రావు, జస్టిస్ మన్‌మీత్ అరోరా ఆధ్వర్యంలోని బెంచ్ ఈ కేసును విచారిస్తూ  నోటీసులు జారీ చేశారు.

అంతేకాదు, దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా సహా అన్నిరకాల ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ వంటి సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన అన్ని వీడియోలను తొలగించాలని ఆదేశించింది. ఇది ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన అంశం విచారణ సందర్భంగా జరిగింది. ఈ కేసుకు సంబంధించి జడ్జిని మార్చాలని కోరుతూ కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా కేజ్రీవాల్ స్వయంగా విచారణకు హాజరై, నేరుగా జస్టిస్ స్వర్ణ కాంత శర్మతో తన వాదనలు వినిపించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.