దిగ్గజ టెకీ కంపెనీ ఒరాకిల్ లేఆఫ్స్ ప్రకటించింది. సుమారు 20 వేల మంది ఆ కంపెనీలో ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఆ కంపెనీ ఈ ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 30 వేల మందిని తొలిగించే అవకాశాలు ఉన్నట్లు చెప్పింది. ఈ-మెయిల్స్ ద్వారా ఈ విషయాన్ని ఉద్యోగులకు చేరవేశారు. అమెరికా, ఇండియా, కెనడా, లాటిన్ దేశాల్లో ఉన్న ఒరాకిల్ కంపెనీ ఉద్యోగులపై భారీ వేటు పడనున్నది. ఒరాకిల్ కంపెనీలో పనిచేస్తున్న సీనియర్లను కూడా తొలగిస్తున్నారు. 33 ఏళ్లుగా ఒరాకిల్ లో చేసిన సీనియర్ సెక్యూర్టీ ప్రొఫెషనల్ నీనా లివస్ కూడా తన ఉద్యోగాన్ని కోల్పోనున్నారు.
30 వేల మంది లేఆఫ్స్‌లో తాను కూడా ఉండబోనున్నట్లు తెలిపారు. తమ కంపెనీ తీసుకున్న నిర్ణయం షాకింగ్‌గా ఉన్నట్లు ఆమె చెప్పింది. కృత్రిమ మేధ ప్రభావం సీనియర్ల ఉద్యోగులపై పడుతున్నట్లు ఆమె అభిప్రాయపడ్డారు. 1990లో లివిస్ ఆ కంపెనీలో చేరారు. డేటాబేస్, సెక్యూర్టీ ప్లాట్‌ఫామ్‌లపై ఆమె పనిచేశారు. ఇటీవల సెక్యూర్టీ అలర్ట్ మేనేజర్‌గా చేశారు. ఇంజినీరింగ్ , సెక్యూర్టీ టీమ్‌లతోనూ ఆమె పనిచేశారు. ఒరాకిల్ కంపెనీలో ప్రిన్సిపల్ ఎథికల్ హ్యాకర్, ప్రిన్సిపల్ సెక్యూర్టీ అనలిస్టుగా లివిస్ చేశారు.సీనియర్ ఉద్యోగులను టార్గెట్ చేసినట్లు భావిస్తున్నానని ఆమె తెలిపారు. ఇటీవల మెటా, మైక్రోసాఫ్ట్, డిస్నీ, ఏఎస్ఎంఎ కంపెనీలు కూడా లేఆఫ్స్ ప్రకటించాయి. మెటా, మైక్రోసాఫ్ట్ కంపెనీలు గత వారంలో 20 వేల ఉద్యోగులను తొలగించాయి.


