పశ్చిమాసియా లో యుద్ధం కారణంగా సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురు పై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఇటీవల అమెరికా ప్రకటించింది. దాంతో ఇరాన్ చమురు కొనుగోలుకు భారత రిఫైనరీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఇరాన్ నుంచి ఓ ఆయిల్ ట్యాంకర్ భారత్ వైపు బయల్దేరింది. మార్చి 4న ఖర్గ్ ద్వీపం వద్ద ట్యాంక్‌లోకి చమురు లోడింగ్ చేశారని, ఏప్రిల్ 4న గుజరాత్ లోని వాడినార్ పోర్టుకు ఇది చేరుకోనుందని డేటా ఇంటెలిజెన్స్ సంస్థ క్లెప్లర్ వెల్లడించింది.
కాగా, 2019 తర్వాత ఇరాన్ ముడి చమురు భారత్‌కు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇందులో దాదాపు 6 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఇరాన్ నుంచి వస్తున్న ఈ చమురును ఏ భారతీయ రిఫైనరీ ఉపయోగించనుందనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు.


