దేశ సమగ్రత, శ్రేయస్సే జనసేన ఎజెండా అని జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఢిల్లీలో పవన్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని పార్టీలు స్వలాభం కోసం దేశ సమగ్రతను ప్రమాదంలో పడేస్తున్నాయని అన్నారు. దేశ శ్రేయస్సే జనసేన ముఖ్య ఉద్దేశమని, అధికారంలోకి రావాలన్న ఆశతో పార్టీ పెట్టలేదని తెలియజేశారు. తెలుగు రాష్ట్ర్రాల్లో 20 లక్షలకు పైగా జనసైనికులు ఉన్నారని, పార్టీ బాగుపడాలంటే, దేశ సమగ్రతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, దేశ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణ ఏర్పాటును నేను వ్యతిరేకించలేదని, రాష్ట్ర్రాన్ని విభజించిన తీరుతోనే సంతృప్తి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర్రాల్లో ఉండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నవారి నోళ్లు, ఢిల్లీకి వచ్చాక పెగలడం లేదని విమర్శించారు. ఢిల్లీ మెడలు వంచుతామని చాలా మంది దక్షిణాది నేతలు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ తీరు ఇప్పటికాకూడా మారలేదని, హైదరాబాద్ లో జనసేన సమావేశానికి అనుమతి ఇవ్వలేదని అన్నారు.

































