కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1943 అక్టోబర్ 1న అప్పటి మద్రాసు ప్రావిన్స్ లో ఏలూరు ప్రాంతం దోశపాడు గ్రామంలో జన్మించారు. ఆయన ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు, భార్య హేమలత ఉన్నారు. ఎన్‌ఐటి వరంగల్‌లో ఆయన డిగ్రీ పూర్తి చేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా సేవలందించారు. ఐదు సార్లు ఎంపి, ఒక సారి కేంద్రమంత్రి పని చేశారు. 1984, 1989. 1998, 2004, 2009వ సంవత్సరాలలో ఎంపి గెలిచి ప్రజలకు సేవలందించారు. 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో చురుకైన నేతగా పేరొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఆయన బిజెపిలో చేరారు. విశాఖపట్నం ఎంపి, నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ ఆయనకు మనవడు అవుతారు. భరత్ స్వయానా కూతురి కుమారుడు కావడం గమనార్హం. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి పట్ల సిఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాన్, ఎంఎల్‌ఎ నందమూరి బాలకృష, నందమూరి రామకృష్ణ సంతాపం తెలిపారు. కావూరు కుటుంబానికి ప్రగాఢ సానూభూతి ప్రకటించారు. రాజకీయ వ్యాపార రంగంలో కావూరు సాంబశివరావుది ప్రత్యేక ముద్ర అని బాబు తెలిపారు. కావూరుతో పంచుకున్న ప్రేమ, అనురాగం, మరువలేనిదని నందమూరి రామకృష్ణ తెలిపారు.


