తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త చెప్పింది. 100 రోజుల్లో రూ.6 వేల కోట్ల బకాయిలు విడుదల చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులకు ఇటీవల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భట్టి విక్రమార్క ఆదేశాలతో తొలి విడత రూ.2 వేల కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన రూ.4వేల కోట్లు త్వరలోనే జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. రిటైర్డ్ ఉద్యోగుల జిపిఎఫ్ బకాయిలు 100 శాతం ప్రభుత్వం క్లియర్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.


