విదేశీ ఐటీ నిపుణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అమెరికా హ్-1భ్ వీసా ప్రక్రియ మొదలైంది. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిజిస్ట్రేషన్లను యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) ప్రారంభించింది. అయితే, ఈసారి నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ పలు కీలక మార్పులు చేపట్టింది. ఈ వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మార్చి 19 వరకు కొనసాగనుంది. అర్హులైన అభ్యర్థులు ఈ గడువులోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా, విదేశాల నుండి ఉద్యోగులను నియమించుకోవాలనుకునే కంపెనీలపై అదనపు భారం పడనుంది. ఇకపై కంపెనీలు అదనంగా లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
సాధారణ లాటరీ విధానంలో మార్పులు చేస్తూ, ఈసారి వెయిటెడ్ సెలక్షన్ పద్ధతిని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం: ఎక్కువ జీతం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత లభిస్తుంది.అత్యున్నత నైపుణ్యం కలిగిన నిపుణులకు ఎంపికలో వెయిటేజీ ఉంటుంది.దీనివల్ల ప్రతిభావంతులకు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడనున్నాయి.
సోషల్ మీడియా వెరిఫికేషన్ తప్పనిసరి :
భద్రతా కారణాల దృష్ట్యా, ఈసారి అభ్యర్థుల సోషల్ మీడియా వెరిఫికేషన్‌ను కూడా తప్పనిసరి చేశారు. అభ్యర్థుల గత కార్యకలాపాలు, సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఆధారంగా వారి అర్హతను పరిశీలిస్తారు. అక్రమ పద్ధతుల్లో వీసాలు పొందకుండా ఉండటానికి ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది.


