ఇండిగో సంస్థ అంతర్గత సమస్యల వల్లే తలెత్తిందని, ప్రభుత్వ నిబంధనల వల్ల కాదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఇండిగో సంక్షోభాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడం లేదు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఈ సమస్యకు ప్రధాన కారణం ఇండిగో సిబ్బంది రోస్టరింగ్, అంతర్గత ప్రణాళిక వ్యవస్థలో ఉన్న లోపాలే. కొత్తగా తెచ్చిన విమాన సిబ్బంది పనివేళల పరిమితి నిబంధనలతో ఎలాంటి సంబంధం లేదు అని రామ్మోహన్ నాయుడు వివరించారు. అందరితో చర్చించిన తర్వాతే ఈ నిబంధనలు రూపొందించామని, డిసెంబర్ 3 వరకు సర్వీసులు సజావుగానే నడిచాయని గుర్తుచేశారు.


