ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఇండస్ట్రీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సమ్మర్ హాలిడేస్ అనే సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అన్నారు. ఈ మాట చెప్పడానికి తాను భయపడనని పేర్కొన్నారు. అలాగే సమ్మర్ హాలిడేస్ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. ఇండస్ట్రీ ప్రస్తుతం చాలా కష్టకాలంలో ఉందని చాలా మంది చెప్పడానికి భయపడతారు. కానీ, నేను ఈ విషయాన్ని ధైర్యంగా చెప్పగలను. ప్రేక్షకులను థియేటర్‌లకు తీసుకురావడమే మనందరికీ ఇప్పుడు సవాల్. సమ్మర్ హాలిడేస్ లాంటి సినిమాలు తీసి ఆడియన్స్‌ను థియేటర్‌కు తీసుకురండి. అప్పుడు ఆటోమెటిక్‌గా మంచి సినిమాలు నిలబడతాయి. చిన్న సినిమాలతో డైరెక్టర్లు అందరూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. కొత్త దర్శకులందరూ మంచి చిత్రాలు తీసి ఇండస్ట్రీని నిలబెట్టండి. చిన్న సినిమాలు ఎంత విజయం సాధిస్తే ఇండస్ట్రీ అంత బాగుంటుంది అని దిల్ రాజు స్పష్టం చేశారు.


