అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సామ్రాజ్యవాద ధోరణిని కొనసాగిస్తున్నారు. ఇటీవలే వెనిజువెలా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి, అక్కడి ప్రభుత్వాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్న ట్రంప్, ఈసారి దావోస్ సదస్సులో గ్రీన్‌లాండ్‌ను హస్తగతం చేసుకుంటామని తేల్చి చెప్పారు. స్విట్జర్‌లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని స్పష్టం చేశారు. ప్రపంచ నేతల ముందే తాము మంచుముక్కను మాత్రమే అడుగుతున్నామని, అది కూడా గ్రీన్‌లాండ్‌కు రక్షణకోసమేనని ఆయన అన్నారు. అంతేకాదు ప్రపంచ ఆర్ధిక సదస్సు సాక్షిగా భారత్, పాకిస్థాన్ యుద్ధాన్ని నేనే ఆపాను అని ట్రంప్ పాత పాటే మళ్లీ పాడారు.


