ఇరాన్ నౌకాదళం ఇప్పటికే కనుమరుగైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్ వైమానికదళం కూడా ఇక ఉండదు అని అన్నారు. ఇరాన్ కు మరోసారి ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మతి చెడిన నేతలకు ఇవాళ ఏం జరుగుతుందో మీరే చూస్తారని, ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయని తెలియజేశారు. ఇరాన్ నాయకులు భూమి పైనుంచి తుడిచిపెట్టుకుపోయారని, 47 ఏళ్లుగా ఇరాన్ అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నారని విమర్శించారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా తాను వారిని అంతం చేస్తున్నానని, తనకు ఈ అవకాశం రావడం ఎంతో గొప్ప గౌరవం అని ట్రంప్ పేర్కొన్నారు.


