మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని, ఒకవేళ మోటార్లకు మీటర్లు పెట్టకపోయినా, ఉచిత విద్యుత్ కొనసాగించినా ఎన్నికల్లో పోటీ నుంచి బిఆర్‌ఎస్ తప్పుకుంటుందా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్‌కు సవాల్ చేశారు. ఈ సందర్భంగా ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం కెసిఆర్ రైతుల ముసు గులో లైఫ్‌లైన్ కోసం ప్రయత్నిస్తున్నార న్నారు. రైతులను అడ్డుపెట్టుకొని బిఆర్‌ఎస్ రా జకీయంగా లబ్ది పొందాలని చూస్తోందని ఆరోపించారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ రెండు డిస్కంలు ప్రస్తుతం ర్యాంకింగ్‌లో 52, 56 స్థానాలకు, ప్రస్తుతం రెండు డిస్కంలు ఉన్నాయని, ప్రస్తుతం అవి ర్యాంకింగ్‌లో 52, 56 స్థానాలకు పడిపోయాయని, ఒకప్పుడు టిఎస్‌పిడిసిఎల్, టిఎస్‌ఎన్‌పిడిసిఎల్‌లు ఈ రెండు డిస్కంలు ర్యాంకింగ్‌లో 3 నుంచి 5 స్థానాల్లో ఉండేవని వాటిని గత ప్రభుత్వం నిర్వీర్యం చేయడంతో వాటి స్థానాలు 50 పైచిలుకు స్థానానికి పడిపోయాయని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఈ రెండు డిస్కంలు రూ.69,75,000 నష్టాల్లో కూరుకుపోయాయని, గత ప్రభుత్వం వల్లే ఈ రెండు డిస్కంలు నష్టాల్లోకి వెళ్లాయని ఆయన ఆరోపించారు. ఉచిత విద్యుత్ పేరుతో ప్రభుత్వం డిస్కంలకు బిల్లులు చెలించకపోవడంతో ఆయా డిస్కంలు అప్పుల ఊబిలోకి నెట్టివేయపడ్డాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకపోవడంతో ఆయా డిస్కంలు జెన్‌కోకు భారీగా బకాయిలు పడ్డాయని, ఇక, జెన్‌కో సింగరేణికి బకాయిలు పడడంతో డిస్కంలు కొలుకొని స్థితికి చేరుకున్నాయని వాటిని గాడిలో పెట్టడానికే రైతు డిస్కంను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.


